అన్నీ పరమ అర్థరహితాలు. “సమస్తం వృధా కాలయాపన!” [*అర్థరహితాలు … కాలయాపన ఈ హెబ్రీ పదానికి “ఆవిరి లేక ఊపిరి” లేక “పనికిమాలినది, అర్థరహితమైనది, శుష్కమైనది, పొరపాటైనది లేక వృథా కాలయాపన” అని అర్థం.] అంటాడు ప్రసంగి.
ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా? [†ఈ జీవితంలో … పొందుతున్నారా? మూలంలో ఈ పదానికి సూర్యుడి కింద అని అర్థం.] (లేదు!)
ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు. [‡విషయాలను … వివరించలేవు అన్ని మాటలూ (విషయాలూ) నిస్సారమైనవే అని వ్యాఖ్యార్థం.] అయితేనేమి, మనుష్యులు మాట్లాడు తూనే వుంటారు. [§అయితేనేమి … ఉంటారు ఈ హీబ్రూ మాటలకి “మాట్లాడగల శక్తి మనిషికి లేదు” అని అర్థం కూడా చెప్పుకోవచ్చు.] మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతునే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు.
పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యులకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు గుర్తుండవు. జ్ఞానం ఆనందాన్ని ఇస్తుందా?
నేను విద్యను అభ్యసించి, దానివల్ల లభ్యమైన జ్ఞానాన్ని ఈ జీవితంలో జరిగే అన్ని విషయాలనూ అవగాహన చేసుకొనేందుకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో, ఇది దేవుడు మనకి అప్పగించిన చాలా కఠినమైన పని అని నేను గ్రహించాను.
“నేను చాలా తెలివైనవాడిని. నాకంటె ముందు యెరూషలేమును పాలించిన రాజులందరికంటె నేను వివేకవంతుడిని. వివేకం, జ్ఞానం వీటి గూర్చి నాకు తెలుసు!” అని నాలో నేను అనుకున్నాను.
వివేకం, జ్ఞానం వెర్రితనం మరియు బుద్ధి తక్కువ ఆలోచనలు చెయ్యడంకంటె ఎలా మెరుగైనవో తెలుసుకోవాలని తీర్మానించుకున్నాను. కాని, ఆ క్రమంలో వివేకం సంపాదించ ప్రయత్నించడం గాలిని పోగుచేసి, మూటగట్ట ప్రయత్నించడం వంటిదేనని నేను గ్రహించాను.